Corona Virus: కరోనా బారినపడిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

TRS MLA Muthireddy infected to Corona virus
  • తెలంగాణ ఎమ్మెల్యేలలో తొలి కేసు
  • అనుమానంతో పరీక్ష చేయించుకుంటే పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి
తెలంగాణలో ప్రజాప్రతినిధి ఒకరు కరోనా బారినపడ్డారు. జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ అనుమానంతో ముత్తిరెడ్డి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్టు వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే కరోనా బారినపడడం ఇదే తొలిసారి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇటీవల కరోనా బారినపడినప్పటికీ కోలుకున్నారు.

కాగా, తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 164 కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించారు. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 133 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,484 కేసులు నమోదు కాగా, 174 మంది మరణించారు. 2,032 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
Corona Virus
TRS
muthireddy yadagiri reddy
Telangana

More Telugu News