Kurnool District: ఫలితం రాకముందే పెళ్లి.. ఐసోలేషన్‌లో వరుడు, క్వారంటైన్‌లో వధువు.. రిస్క్‌లో 70 కుటుంబాలు!

bride groom tested positive now in isolation

  • కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఘటన
  • రిసెప్షన్‌లో అస్వస్థతకు గురైన వరుడు
  • పెళ్లి తర్వాత వచ్చిన ఫలితం

కరోనా పరీక్షలు చేయించుకుని ఫలితం రాకముందే పెళ్లి చేసుకున్న ఓ యవకుడు.. వధువు సహా 70 మందిని రిస్క్‌లోకి నెట్టేశాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జరిగిందీ  ఘటన. మర్రిమానుతండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.

కరోనా పరీక్షల కోసం శాంపిళ్లు ఇచ్చి ఫలితం రాకముందే గ్రామానికి చేరుకుని ఈ నెల 10న ఎల్.తండాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అదే రోజు రాత్రి ఎల్.తండాలో ఏర్పాటు చేసిన విందులో వరుడు అస్వస్థతకు గరయ్యాడు. అదే సమయంలో అతడు కరోనా బారినపడినట్టు ఫలితం వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వరుడిని ఐసోలేషన్‌కు, వధువును క్వారంటైన్‌కు తరలించారు. వివాహ వేడుకల్లో పాల్గొన్న వారు, అతనిని కలసిన వారు మొత్తం 70 కుటుంబాల వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

  • Loading...

More Telugu News