Corona tax: వాహనదారులపై ‘కరోనా’ బాదుడు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- వారం రోజులుగా పెరుగుతున్న పెట్రో ధరలు
- కరోనా ట్యాక్స్ పేరుతో రూపాయి పెంపు
- నేటి నుంచే అమల్లోకి
గత వారం రోజులుగా పెట్రో ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతుండగా, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్‌పై కరోనా ట్యాక్స్ పేరుతో వాహనదారుల నెత్తిన మరో బండ వేసింది. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి చొప్పున కరోనా ట్యాక్స్ విధించిన ప్రభుత్వం ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. కరోనా ట్యాక్స్‌తో కలుపుకుని రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరు రూ. 82.64కు పెరగ్గా, డీజిల్ ధర రూ. 73.14కు చేరుకుంది.