JC Diwakar Reddy: న్యాయస్థానానికి వెళ్లడం తప్ప మాకు మరో మార్గం లేదు!: అరెస్టులపై జేసీ దివాకర్ రెడ్డి

jc divakar reddy fires on ycp

  • అరెస్టులపై ఏమీ మాట్లాడబోను
  • నిరసనగా ఎటువంటి కార్యక్రమ ప్రణాళిక లేదు
  • నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 
  • ఆయనను నియంత్రణలో పెట్టడం ప్రధాని మోదీకే సాధ్యం

ఏపీ సర్కారులో పనిచేస్తోన్న అధికారులు ప్రభుత్వం చెప్పింది తప్పా ఏమీ చేయలేక పోతున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై తాను ఇప్పట్లో ఏమీ మాట్లాడబోనని, అలాగే, వారి అరెస్టుకు నిరసనగా ఎటువంటి కార్యక్రమ ప్రణాళిక లేదని చెప్పారు.

న్యాయస్థానానికి వెళ్లడం తప్ప తమకు మరో మార్గం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందని, చివరకు ఏసు ప్రభు చెప్పినా జగన్‌ వినబోరని అన్నారు. అయితే, ఆయనను నియంత్రణలో పెట్టడం ప్రధాని మోదీకే సాధ్యమని చెప్పారు. తనకు ఎన్ని లారీలు, ఎన్ని బస్సులు ఉన్నాయో తనకే తెలియదని ఆయన చెప్పారు.

ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పాటించట్లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. తన మాటకు ఎదురు చెప్పేవాడితో పాటు ప్రతి పక్షంలో ఎవరూ లేకుండా చేయడమే లక్ష్యంగా జగన్ పాలన కొనసాగుతోందని చెప్పారు. తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News