Nara Lokesh: టీడీపీ నేత చింతమనేని అరెస్టు.. తీవ్రంగా ఖండించిన లోకేశ్

lokesh condemns chintamaneni arrest

  • కొవిడ్-19 నిబంధనలు ఒక్క టీడీపీ నాయకులకేనా? 
  • చింతమనేని ఎక్కడా గుంపులుగా తిరగలేదు
  • ఆయన వెంట అనుచరులు లేరు
  • ఆఖరికి కరోనాని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న జగన్    

నిన్న ఏలూరు సమీపంలో కలపర్రు టోల్ గేటు వద్ద నిరసన చేయడానికి ప్రయత్నించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీస్ ‌స్టేషన్‌లో అర్ధరాత్రి ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నారు.

ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. 'టీడీపీ నాయకుడు చింతమనేని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొవిడ్-19 నిబంధనలు ఒక్క టీడీపీ నాయకులకేనా? చింతమనేని ఎక్కడా గుంపులుగా తిరగలేదు, వెంట అనుచరులు లేరు. ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు' అని లోకేశ్ మండిపడ్డారు.

'ఆఖరికి కరోనాని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న జగన్ గారి మానసిక స్థితిని చూసి జాలేస్తుంది. వైకాపా నాయకులు కోవిడియట్స్ గా మారారు అని జాతీయ మీడియా సైతం ఉతికి ఆరేసింది. గుంపులుగా తిరిగి, ర్యాలీలు నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన వైకాపా నేతలపై కేసులు ఉండవా?' అని విమర్శించారు.

  • Loading...

More Telugu News