Shahid Afridi: అఫ్రిదీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా: గౌతమ్ గంభీర్

Gautam Gambhir hopes for fast recovery of Shahid Afridi

  • కరోనా బారిన పడ్డ పాక్ మాజీ ఆల్ రౌండర్ అఫ్రిదీ
  • అఫ్రిదీతో వ్యక్తిగత వైరం లేదని చెప్పిన గంభీర్
  • కరోనా ఎవరికీ రాకూడదని వ్యాఖ్య

పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈరోజు ఓ టీవీ షోలో గంభీర్ మాట్లాడుతూ... అఫ్రిదీతో తనకున్నవి రాజకీయ పరమైన విభేదాలు మాత్రమేనని, వ్యక్తిగత వైరం కాదని చెప్పాడు. వైరస్ నుంచి అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. కరోనా వైరస్ ఎవరికీ రాకూడదని అన్నాడు.

కరోనా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరూ కోలుకోవాలని గంభీర్ ఆకాంక్షించాడు. భారత్ కు సాయం చేస్తామని పాక్ అంటోందని.. ముందు వారి దేశం గురించి వారు ఆలోచించుకోవాలని ఎద్దేవా చేశాడు. భారత్ కు సాయం చేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమేనని... అయితే, ముందు బోర్డర్ వద్ద ఉగ్రవాదాన్ని ఆపాలని అన్నాడు.

ఇక, కశ్మీర్ అంశంపై అఫ్రిదీ, గంభీర్ ల మధ్య ఎప్పుడూ ట్విట్టర్ వార్ నడుస్తుంటుందనే సంగతి తెలిసిందే. భారత ప్రధానిపై కూడా ఇటీవల అఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ సందర్భంగా అఫ్రిదీ వంటి జోకర్లు భారత్ పై ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంటారని గంభీర్ కౌంటర్ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News