TPG: జియో ప్లాట్ ఫాంపైకి పెట్టుబడుల వెల్లువ... రూ.4,546 కోట్ల పెట్టుబడితో వచ్చిన టీపీజీ
- ఇప్పటికే జియో ప్లాట్ ఫాంపై భారీ పెట్టుబడులు
- తాజా పెట్టుబడితో 0.93 శాతం వాటా దక్కించుకున్న టీపీజీ
- రూ.1,02,432.15 కోట్లకు పెరిగిన జియో ప్లాట్ ఫాం విలువ
ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని జియో ప్లాట్ ఫాంపై పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఫేస్ బుక్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్, విస్టా ఈక్విటీ, కేకేఆర్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టి వాటాలు దక్కించుకున్నాయి. తాజాగా, వరల్డ్ క్లాస్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ టీపీజీ కూడా జియో వైపు అడుగులు వేస్తోంది. మొత్తం రూ.4,546.8 కోట్ల పెట్టుబడితో జియోలో ప్రవేశించనుంది. ఈ మొత్తంతో టీపీజీకి జియో ప్లాట్ ఫాంలో 0.93 శాతం వాటా లభించనుంది. ఇక, టీపీజీ పెట్టుబడి తర్వాత జియో ప్లాట్ ఫాం విలువ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.1,02,432.15 కోట్లకు పెరిగింది.