Vijay Sai Reddy: వారి అకాల మరణాలకు అచ్చెన్న, పెదబాబు, చినబాబు బాధ్యత వహించాలి: విజయసాయిరెడ్డి
- టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో దారుణాలు
- చికిత్స పొందుతూ మరణించిన వారి వివరాలను బయట పెట్టాలి
- నాసిరకం మందులు, నకిలీ డయాగ్నిస్టిక్ కిట్ల తయారీ
- దాని వల్లే కార్మికులు వ్యాధి ముదిరి చనిపోయారు
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 'టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుల వివరాలను ఆ సంస్థ బయట పెట్టాలి. వీరంతా నాసిరకం మందులు, నకిలీ డయాగ్నిస్టిక్ కిట్ల వల్ల వ్యాధి ముదిరి చనిపోయారు. కార్మికుల అకాల మరణాలకు అచ్చెన్న, పెదబాబు, చినబాబు బాధ్యత వహించాలి' అని ఆయన ట్వీట్లు చేశారు.
'వాళ్లంతా 20 వేల లోపు జీతాలు పొందే కార్మికులు. ఈఎస్ఐ సభ్యత్వం కింద నెలకు రూ.50-70 చెల్లిస్తారు. అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో మంచి చికిత్స దొరుకుతుందని ఆశపడితే, మీ బినామీ, అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్న చేసిందేమిటి? 900 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి కార్మికుల ఉసురు తీశారు' అని విజయసాయిరెడ్డి తెలిపారు.