JC Pawan Kumar Reddy: మా చిన్నాన్నను కడప జైలుకు తీసుకెళ్లడంలో మతలబు ఏంటి?: జేసీ పవన్ కుమార్ రెడ్డి

JC Pawan Kumar responds on JC Prabhakar Reddy arrest
  • లారీ చాసిస్ ల వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
  • కడప జైలుకు తరలింపు
  • మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్న జేసీ పవన్
ఇటీవల కాలంలో జేసీ సోదరులు నిత్యం వార్తల్లో ఉంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల ట్రావెల్స్ వ్యాపారంపై అధికారుల దాడుల విషయం మీడియాలో ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంది. తాజాగా బీఎస్-3 లారీ చాసిస్ లను తుక్కుసామాను కింద కొనుగోలు చేసి, వాటిని బస్సులుగా మార్చి తిప్పుతున్నారంటూ అభియోగాలు మోపి జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ యువనేత జేసీ పవన్ కుమార్ రెడ్డి స్పందించారు.

తన బాబాయి జేసీ ప్రభాకర్ రెడ్డిని కడప జిల్లా జైలుకు తరలించడం వెనకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. న్యాయమూర్తి అనంతపురం జైలుకు కానీ, తాడిపత్రి జైలుకు కానీ తీసుకెళ్లాలని చెప్పినా, కడప సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారని ఆరోపించారు. తన బాబాయి జేసీ ప్రభాకర్ రెడ్డి వయసు 70 ఏళ్లని, ఆయనను హైదరాబాద్ నుంచి 500 కిలోమీటర్లు తీసుకువచ్చి అర్ధరాత్రి వరకు అనంతపురం పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై తాము మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని అన్నారు.
JC Pawan Kumar Reddy
JC Prabhakar Reddy
Arrest
Kadapa Jail
Anantapur District

More Telugu News