Anita Rani: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ అనితారాణి
- వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ ఆరోపించిన అనితారాణి
- సీఐడీ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
- సీఐడీ విచారణపై నమ్మకం లేదంటూ హైకోర్టులో అనితారాణి పిటిషన్
చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ నేతలు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని డాక్టర్ అనితారాణి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సర్కారు సీఐడీ విచారణకు ఆదేశించగా, సీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదంటూ డాక్టర్ అనితారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆసుపత్రిలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలపై సీఐడీ నిష్పాక్షికంగా విచారణ చేయడం లేదని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. తాను లేవనెత్తిన అంశాలను సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె తన పిటిషన్ లో కోరారు. అనితారాణి పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. కాగా, ఈ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణకు వచ్చిన సమయంలో డాక్టర్ అనితారాణి తన ఇంటికి తాళం వేసుకున్నట్టు తెలుస్తోంది.