Telangana: తెలంగాణలో ఇంటి వద్దే కరోనా పరీక్షలకు అనుమతి... ఫీజును నిర్ణయించిన ప్రభుత్వం!
- ప్రైవేటు ల్యాబ్ లకు అనుమతి
- రూ. 2,800 మాత్రమే తీసుకోవాలి
- ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు
తెలంగాణలో ఇంటి వద్దే కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ల్యాబ్ లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ. 2,800 చెల్లించాలని, ఏదైనా ల్యాబ్ అంతకుమించి తీసుకుంటే, కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రజలు సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ ల్యాబుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. కాగా, తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అనుమతిస్తూ, అందుకు వసూలు చేయాల్సిన ఫీజులను ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.