KCR: నాతో సహా అధికారులకు ఇప్పుడు అంతకుమించిన పని మరొకటి లేదు: జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్

Telangana CM KCR held meeting with district officials

  • ఇప్పుడు కాకపోతే గ్రామాలు ఇంకెప్పుడూ బాగుపడవన్న సీఎం కేసీఆర్
  • తెలంగాణ పల్లెలన్నీ బాగుండాలని ఆకాంక్ష
  • లక్ష కల్లాలు ఏర్పాటు చేయాలని వెల్లడి

హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్ వ్యవసాయ రంగంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో పల్లెలన్నీ బాగుండాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతులకు అవసరమైన ప్రణాళిక రచించాలని స్పష్టం చేశారు.

ఈ ఏడాది రైతుల భూముల్లో లక్ష కల్లాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రెండు నెలల్లోగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లోగా రైతు వేదికలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. నాలుగేళ్లలో గ్రామాల్లో పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.  

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం ప్రతి రోజూ శుభ్రం కావాల్సిందేనని అన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని, సీఎంనైన తనతో సహా అధికారులందరికీ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం, అభివృద్ధి చేయడం మించిన పని మరొకటి లేదని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పక్కా ప్రణాళికతో ఉపయోగించుకోవాలని తెలిపారు.

  • Loading...

More Telugu News