KCR: కల్నల్ సంతోష్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

 CM KCR shocks after Colonel Santhosh demise

  • వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణల్లో కల్నల్ సంతోష్ మరణం
  • సంతోష్ కుటుంబాన్ని ఆదుకుంటామన్న సీఎం కేసీఆర్
  • సంతోష్ తెగువ, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్న కేటీఆర్

భారత్, చైనా బలగాల మధ్య లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని కీర్తించారు. సంతోష్ త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేగాకుండా, సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతోపాటు, ఆయన అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రతినిధిగా పాల్గొనాలంటూ మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు.

కాగా, కల్నల్ సంతోష్ స్వస్థలం సూర్యాపేట. కోరుకొండ సైనిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసిన సంతోష్ ఎంతో ఇష్టంతో సైన్యంలో ప్రవేశించారు. అటు సంతోష్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంతోష్ తెగువ, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News