Nara Lokesh: తాడిపత్రిలో లోకేశ్ పర్యటన నిర్వాహకులపై కేసు నమోదు

Case filed against TDP leaders in Tadipatri
  • జేసీ దివాకర్ రెడ్డి, పవన్‌లను పరామర్శించిన లోకేశ్
  • పర్యటనలో భౌతిక దూరం పాటించలేదని, మాస్కులు ధరించలేదని ఫిర్యాదు
  • ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ పవన్‌ను పరామర్శించేందుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ సోమవారం తాడిపత్రిలో పర్యటించారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించిన ఇద్దరిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారమే ఈ కేసు నమోదైనప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, అభిమానులు మాస్కులు ధరించలేదని, భౌతిక దూరం పాటించలేదని తాడిపత్రి టౌన్ ఎస్సై ఖాజా హుస్సేన్ ఫిర్యాదు చేశారు. దీంతో కార్యక్రమ నిర్వాహకులు రఘునాథ, సోమశేఖర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Nara Lokesh
Tadipatri
JC Prabhakar Reddy
JC Diwakar Reddy
TDP

More Telugu News