Nara Lokesh: అమాయకులైన గిరిపుత్రులకు అన్యాయం చెయ్యడానికి మనసెలా వచ్చింది జగన్ గారు?: లోకేశ్

lokesh fires on jagan

  • గిరిజనుల హక్కులను కాలరాసే అధికారం మీకెవరిచ్చారు? 
  • జీవో-3 తీసుకొచ్చింది నాటి టీడీపీ ప్రభుత్వమే
  • సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది
  • వైకాపా ప్రభుత్వం రివ్యూపిటిషన్ వెయ్యకపోవడం దారుణం

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. 'అమాయకులైన గిరిపుత్రులకు అన్యాయం చెయ్యడానికి మనసెలా వచ్చింది జగన్ గారు? గిరిజనుల హక్కులను కాలరాసే అధికారం మీకెవరిచ్చారు? గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పించేలా జీవో-3 తీసుకొచ్చింది నాటి టీడీపీ ప్రభుత్వం' అని తెలిపారు.
 
'సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేస్తే, వైకాపా ప్రభుత్వం దానిపై రివ్యూపిటిషన్ కూడా వెయ్యకపోవడం దారుణం. ఈ విషయంపై గిరిజనులు చేస్తున్న పోరాటానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది' అని చెప్పారు.

'గిరిజన హక్కులు కాపాడే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు గిరిజన సలహా మండలిలో చర్చించి ఎస్టీ ఉద్యోగ రిజర్వేషన్ కి సమగ్ర చట్టం రూపొందించాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News