KA Paul: చైనాకు బుద్ధి చెప్పే నాయకుడు ఈ ప్రపంచంలో లేకపోవడమే సమస్యలకు కారణం: కేఏ పాల్

KA Paul says there is no leadership in the world to counter China

  • కరోనా గురించి ముందే చెప్పానన్న పాల్
  • వుహాన్ ల్యాబ్ నుంచి ఉద్దేశపూర్వకంగా పంపారని ఆరోపణ
  • ట్రంప్ తెరవెనుక చైనాతో వ్యాపారాలు చేస్తున్నాడని వెల్లడి

ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చారు. ప్రస్తుత పరిణామాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. చైనాకు బుద్ధి చెప్పే నేత ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేకపోవడమే అనేక సమస్యలకు కారణమవుతోందని అన్నారు.

కరోనా వైరస్ గురించి ఎంతో ముందుగా తానే వెల్లడించానని, వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ను ఉద్దేశపూర్వకంగా పంపించారని ఆరోపించారు. చైనాకు శాంతి అక్కర్లేదని, వాళ్లు యుద్ధాన్నే కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి సరిగా లేదని, ఆయన చైనాతో తెరవెనుక వ్యాపారాలు చేస్తున్నాడని, చైనా సహాయం కోరుతున్నాడని తాను ఎప్పట్నించో చెబుతున్నానని, ఆ విషయాన్నే తాజాగా అమెరికాలో ప్రముఖ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొందని కేఏ పాల్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News