Mobile Testing Center: దేశంలో తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని ప్రారంభించిన కేంద్రం

India launches first mobile corona testing center

  • మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసే సౌలభ్యం
  • ఫిబ్రవరిలో ఒకే ఒక్క కరోనా పరీక్ష కేంద్రం ఉందన్న కేంద్ర ఆరోగ్యమంత్రి
  • ఇప్పుడు 953 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని వెల్లడి

భారత్ లో తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని మంత్రి అన్నారు. వీటి ద్వారా  రోజు 25 ఆర్టీ పీసీఆర్ టెస్టులు, 300 ఎలీసా టెస్టులు చేయడమే కాకుండా, హెచ్ఐవీ, టీబీ పరీక్షలు కూడా చేసే వీలుంది. ఫిబ్రవరిలో భారత్ లో కరోనాతో పోరాటం మొదలైందని, అప్పుడు దేశంలో ఒకే ఒక్క కరోనా పరీక్షల కేంద్రం ఉందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా 953 ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అందులో 699 ప్రభుత్వ ల్యాబ్ లేనని తెలిపారు.

  • Loading...

More Telugu News