Sensex: దూసుకుపోయిన దేశీయ మార్కెట్లు

Sensex ends 700 points high

  • 700 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 211 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పుంజుకున్న బజాజ్ ఫైనాన్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే  పయనించాయి. హెల్త్ కేర్, టెలికాం మినహా అన్ని సూచీలు లాభాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 700 పాయింట్లు లాభపడి 34,208కి పెరిగింది. నిఫ్టీ  211 పాయింట్లు పెరిగి 10,092కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (5.46%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.02%), యాక్సిస్ బ్యాంక్ (4.10%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.01%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.96%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-0.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.63%), టీసీఎస్ (-0.52%), భారతి ఎయిర్ టెల్ (-0.48%), మారుతి సుజుకి (-0.29%).

  • Loading...

More Telugu News