Karan Johar: షారుఖ్, అక్షయ్, అమితాబ్ మినహా బాలీవుడ్ నటులందర్నీ అన్ ఫాలో చేసిన కరణ్ జొహార్

Karan Johar unfollows celebreties in social media
  • ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య
  • కరణ్ జొహార్ పై విమర్శలు
  • కరణ్ ను అన్ ఫాలో చేసిన లక్షమంది నెటిజన్లు
ఇటీవల యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సుశాంత్ కు అవకాశాలు రాకుండా చేసినవారిలో కరణ్ కూడా ఉన్నాడంటూ ఆరోపణలు వినిపించాయి. సుశాంత్ ఆత్మహత్యకు పరోక్ష కారకుడన్న వాదనల నడుమ, దాదాపు లక్షమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కరణ్ జొహార్ ను అన్ ఫాలో చేశారు.

ఇదే సమయంలో ఇటు కరణ్ జొహార్ కూడా అనేకమంది బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను అన్ ఫాలో చేశారు. ట్విట్టర్ లో కరణ్ ఇప్పుడు కేవలం ఎనిమిది మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. వారిలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ వంటివారు ఉన్నారు. సుశాంత్ వ్యవహారంలో తాను ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందన్న ఆవేదనలో కరణ్ జొహార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, గతంలో కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సుశాంత్ పై వ్యాఖ్యలు చేసిన అలియా భట్ ను కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బంధుప్రీతి రాజ్యమేలుతున్నందునే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అర్ధాంతరంగా తనువుగా చాలించాడంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Karan Johar
Social Media
Twitter
Unfollow
Sushant Singh Rajput
Bollywood

More Telugu News