Balineni Srinivasa Reddy: వైసీపీలోకి త్వరలోనే మరికొందరు వస్తున్నారు: మంత్రి బాలినేని వెల్లడి

 AP Minister Balineni Srinivasa Reddy says more leaders will be coming into YSRCP
  • వైసీపీలోకి వలసలు
  • టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారన్న బాలినేని
  • ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలనే తీసుకుంటామని వెల్లడి
ఇటీవల కాలంలో అధికార వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై ఏపీ మంత్రి, ప్రకాశం జిల్లా వైసీపీ అగ్రనేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. త్వరలోనే టీడీపీ నుంచి మరికొందరు నేతలు వైసీపీలోకి వస్తారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని వెల్లడించారు. టీడీపీలో ఉన్న ఇబ్బందులను తమతో చెబుతున్నారని వివరించారు.

అయితే, ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు వస్తేనే వైసీపీలోకి తీసుకుంటామని బాలినేని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ గెలిచాక, మిగతా జిల్లాలతో పోల్చితే ప్రకాశం జిల్లాలోనే అధికంగా టీడీపీ నేతలు వైసీపీ బాటపడుతున్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వంటి వారు ఇప్పటికే టీడీపీకి దూరమయ్యారు. మరో ముఖ్యనేత కరణం బలరాం అధికారికంగా వైసీపీలో చేరకపోయినా సీఎం జగన్ కు మద్దతుగా మాట్లాడుతూ ఆ పార్టీకి క్రమంగా చేరువ అవుతున్నారు.
Balineni Srinivasa Reddy
YSRCP
Telugudesam
MLA
Andhra Pradesh

More Telugu News