KTR: ఐటీ రంగం అభివృద్ధిలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువ: కేటీఆర్

IT Minister KTR releases development report

  • ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
  • దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా పెంపు
  • లక్షల మందికి నేరుగా ఉపాధి లభిస్తోందని వెల్లడి

తెలంగాణ ఐటీ శాఖ ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ ఐటీ రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఐటీ రంగంలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువ అని తెలిపారు. ఐటీ ఎగుమతుల జాతీయ అభివృద్ధి 8.09 శాతం అయితే, రాష్ట్రంలో అది 17.97 శాతంగా ఉందని వివరించారు. దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61 నుంచి 11.58 శాతానికి పెరిగిందని కేటీఆర్ వెల్లడించారు.

 ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ ప్రాంగణం హైదరాబాదులోనే ఏర్పాటైందని అన్నారు. రాష్ట్రంలో మైక్రాన్ సంస్థ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం స్థాపించిందని, తెలంగాణలోని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగం విస్తరిస్తోందని తెలిపారు. దాదాపు 250కి పైగా కంపెనీలతో 1.16 లక్షల మందికి నేరుగా ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. ఇక ఎలక్ట్రానిక్ విభాగం కూడా భారీగా పెట్టుబడులు తీసుకువచ్చిందని వివరించారు.

  • Loading...

More Telugu News