Nayanatara: నయనతారకు కరోనా పాజిటివ్ అంటూ వార్తలు... క్లారిటీ ఇచ్చిన ప్రతినిధి

Speculations raises that Nayanatara and Vighnesh Sivan get infected
  • నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ లకు కరోనా సోకిందని ప్రచారం
  • ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసిన ప్రతినిధి
  • పుకార్లు వ్యాప్తి చేయొద్దంటూ విజ్ఞప్తి
కోలీవుడ్ లో ఇప్పుడో వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ కరోనా బారినపడ్డారని, వారికి కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

దీనిపై నయనతార, విఘ్నేశ్ ల ప్రతినిధి వివరణ ఇచ్చారు. నయనతార, విఘ్నేశ్ ల ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని, వారికి కరోనా సోకిందనడం ఓ పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, చెన్నైలోని తమ నివాసంలో ఉన్నారని వెల్లడించారు. దయచేసి ఎవరూ అసత్య కథనాలను ప్రచారం చేయొద్దని విజ్జప్తి చేశారు.

ఐదేళ్లుగా డేటింగ్ లో ఉన్న నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. దీనిపై వారిద్దరిలో ఎవరూ స్పందించకపోవడంతో స్పష్టత రాలేదు.
Nayanatara
Vighnesh
Corona Virus
Positive
Fake News

More Telugu News