Peddireddi Ramachandra Reddy: రఘురామకృష్ణంరాజు స్పీకర్ కు ఫిర్యాదు చేయడం వెనుక చంద్రబాబు ఉన్నాడు: మంత్రి పెద్దిరెడ్డి ఆరోపణలు

AP Minister Peddireddy comments on Raghuramakrishnam Raju issue
  • చంద్రబాబే ఎంపీతో మాట్లాడిస్తున్నాడని ఆరోపణలు
  • ల్యాటరైట్ గనుల్లో వైసీపీ నేతలు దోచుకున్నారన్నది అసత్యమని వెల్లడి
  • ఇప్పట్లో రాజధాని తరలింపు ఉండదన్న మంత్రి పెద్దిరెడ్డి
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని తెలిపారు. చంద్రబాబే రఘురామకృష్ణంరాజుతో మాట్లాడిస్తున్న విషయం అందరికీ తెలుసని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ల్యాటరైట్ గనుల్లో వైసీపీ నేతలు దోచుకున్నారన్నది అసత్యమని స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. సరస్వతి పవర్ అంశంలో నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ, జూలై నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య రెట్టింపయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సమయంలో రాజధాని తరలింపు ప్రక్రియ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
Peddireddi Ramachandra Reddy
Raghurama Krishnamraju
Chandrababu
YSRCP
Telugudesam

More Telugu News