RGV: అమృత, మారుతీరావు కథతో వర్మ 'మర్డర్'

Ram Gopal Varma announces new movie Murder based on real story
  • సంచలనం సృష్టించిన అమృత-ప్రణయ్ ఉదంతం
  • ఫాదర్స్ డే సందర్భంగా సినిమా అనౌన్స్ చేసిన వర్మ
  • కుటుంబ కథా చిత్రం అంటూ క్యాప్షన్
వేగంగా సినిమాలు తీయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట. లాక్ డౌన్ రోజుల్లోనే కరోనా పేరుతో సినిమా తీసి అందరినీ విస్మయానికి గురిచేయడం వర్మకే చెల్లింది. తాజాగా మరో చిత్రం ప్రకటించారు. కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన అమృత-ప్రణయ్, ఆమె తండ్రి మారుతీరావుల కథను సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి 'మర్డర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు, కుటుంబ కథా చిత్రమ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
RGV
Murder
Amrutha
Maruthi Rao
Pranay

More Telugu News