Ratan Tata: ఆన్ లైన్ కమ్యూనిటీ చాలా బాధిస్తోంది... అలా చేయవద్దు: రతన్ టాటా వినతి

Ratan Tata Comments on Online Comunity Hate Comments

  • పక్కవారిపై విద్వేషాలు చూపుతున్నారు
  • స్వీయ న్యాయ నిర్ణయంతో విరుచుకుపడుతున్నారు
  • రాగద్వేషాలను పక్కనబెట్టాలన్న రతన్ టాటా

సోషల్ మీడియా వేదికగా, నెటిజన్లు ఎవరిపైనా విద్వేషాలు చూపరాదని, బెదిరింపులకు కూడా పాల్పడవద్దని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సూచించారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

"ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి ముందూ ఎన్నో సవాళ్లను నిలిపింది. ఆన్ లైన్ కమ్యూనిటీ ఇతరులను బాధించేలా వ్యాఖ్యలు చేస్తుండటాన్ని నేను గమనిస్తున్నాను. తమంతట తామే న్యాయ నిర్ణయం చేస్తున్న వీరు, ఇతరులపై విరుచుకుపడుతున్నారు" అని అన్నారు.

ఆపై "ఈ సంవత్సరం ఏర్పడిన పరిస్థితులు ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు తోడ్పడతాయని నేను నమ్ముతున్నాను. ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించే సమయం కాదిది. ఒకరితో ఒకరు మర్యాదపూర్వకంగా ఉండాలి. నేను ఆన్ లైన్ లో కనిపించేది కాసేపే. ఇక్కడ మంచి వాతావరణం నెలకొనాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కోపాన్ని, రాగద్వేషాలను పక్కనబెట్టి, బాధ్యతగా ఉండాలి" అని ఆయన విన్నవించారు.

  • Loading...

More Telugu News