Pawan Kalyan: నేతన్న నేస్తం పథకం కొందరికే వర్తింపచేయడం సరికాదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan demands AP government to implement Nethanna Nestam for all

  • చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం ప్రకటించిన ఏపీ సర్కారు
  • చేనేత కార్మికులు అందరికీ వర్తింపజేయాలన్న పవన్
  • ప్రతి కార్మికుడ్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్

సొంత మగ్గం ఉన్నవారికే నేతన్న నేస్తం పథకం వర్తింపజేయడం సరికాదని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సొంత ఇల్లు లేక, అద్దె ఇళ్లలో మగ్గాలు ఏర్పాటు చేసుకోలేక, షెడ్డులో మగ్గం పెట్టుకుని ఉపాధి పొందుతున్న నేత కార్మికులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమైన అంశం అని తెలిపారు. చేనేత రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో 2.8 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారని, కానీ ప్రభుత్వ పథకం 81 వేల మందికే లభించనుండడం భావ్యం కాదని పేర్కొన్నారు.

నేత నేసేవారితో పాటు అద్దకం పనివాళ్లు, పడుగు-పేక, ఆసు పోయడం వంటి అనేక అనుబంధ విభాగాలు కలిస్తేనే ఓ చేనేత ఉత్పత్తి బయటికి వస్తుందని పవన్ వివరించారు. ఒక చేనేత ఉత్పత్తిలో ఇంతమంది కష్టం ఉన్నప్పుడు నేతన్న నేస్తం కొందరికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సహేతుకంగా లేదని, ఈ రంగంపై ఆధారపడి ఉన్న ప్రతి కార్మికుడిని ఈ పథకానికి పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News