Renu Desai: బంధుప్రీతి అన్నది అన్ని రంగాల్లోనూ ఉంటుంది: రేణుదేశాయ్

renu about nepotism

  • సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై మాట్లాడిన రేణు
  • నైపుణ్యాలు ఉండి ధైర్యంగా నిలబడగలిగాలి
  • సుశాంత్‌ది చాలా సున్నితమైన మనస్తత్వం  అయుండొచ్చు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నెపోటిజం (బంధుప్రీతి) అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నటి రేణు దేశాయ్ స్పందించారు. నెపోటిజం అన్ని రంగాల్లోనూ ఉంటుందని, నైపుణ్యాలు ఉండి ధైర్యంగా నిలబడగలిగితే దాన్ని జయించి విజయం సాధించొచ్చని తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయనకు టాలెంట్ ఉంది కాబ‌ట్టే సినిమాల్లో విజయం సాధించాడని, అయితే, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోలేక‌పోయాడేమోనని అన్నారు. అందుకే ఆయన కుంగుబాటుకు గురై ఉంటాడని రేణు దేశాయ్ చెప్పారు.

 కేవలం కుటుంబ నేపథ్యాన్ని న‌మ్ముకుని సినీ రంగంలోకి రావద్దని, నటులకు మ‌నో ధైర్యం కూడా ఉండాలని ఆమె హితవు పలికారు. సినిమా రంగంలో మెరుగ్గా రాణించాలంటే మాన‌సిక ధైర్యం కూడా అవ‌సరమని చెప్పారు.

  • Loading...

More Telugu News