Rammohan Naidu: పిన్న వయసులోనే అరుదైన ఘనతను సాధించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
- సంసద్ రత్న 2020 అవార్డుకు ఎంపిక
- చిన్న వయసులో ఈ ఘనతను సాధించిన ఎంపీగా రామ్మోహన్ రికార్డు
- టీడీపీ శ్రేణులకు అంకితమన్న రామ్మోహన్
యువ నాయకుడు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అరుదైన ఘనతను సాధించారు. పార్లమెంటేరియన్ల పనితీరు ఆధారంగా ఇచ్చే సంసద్ రత్న అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. మంచి పనితీరును కనపరిచే పార్లమెంటు సభ్యుడికి ఈ అవార్డును ఇస్తారు. ఈ అవార్డుకు ఎంపిక కావడమే కావడమే కాకుండా... అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించిన ఎంపీగా రామ్మోహన్ నాయుడు రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులకు, కింజరపు అభిమానులకు అవార్డును అంకితమిస్తున్నట్టు తెలిపారు.
2010 నుంచి సంసద్ రత్న అవార్డులను ప్రకటిస్తున్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సూచనతో ఈ అవార్డులను ఇస్తున్నారు. ఈ ఏడాదికి 10 మంది ఎంపీలను ఎంపిక చేయగా... వారిలో ఎనిమిది మంది లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు.
సంసద్ రత్న అవార్డులకు ఎంపికైన వారి జాబితా:
లోక్ సభ సభ్యులు:
రామ్మోహన్ నాయుడు (టీడీపీ-ఏపీ), శశిథరూర్ (కాంగ్రెస్-కేరళ), నిషికాంత్ దూబే (బీజేపీ-ఝార్ఖండ్), సుభాష్ రామ్ రావ్ భమ్రే (బీజేపీ-మహారాష్ట్ర), అజయ్ మిశ్రా (బీజేపీ-ఉత్తరప్రదేశ్), హీనా గవిట్ (బీజేపీ-మహారాష్ట్ర), సుప్రియా సూలే (ఎన్సీపీ-మహారాష్ట్ర), అమోల్ రామ్ సింగ్ కోలే (ఎన్సీపీ-మహారాష్ట్ర).
రాజ్యసభ సభ్యులు:
ఛాయా వర్మ (కాంగ్రెస్-ఛత్తీస్ గఢ్), విశంబర్ ప్రసాద్ నిషద్ (సమాజ్ వాదీ పార్టీ-ఉత్తరప్రదేశ్)లతో పాటు పీసీ గద్ది గౌడర్ (వ్యవసాయ కమిటీ చైర్మన్) ఉన్నారు.