IYR Krishna Rao: ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగినది: ఐవైఆర్ కృష్ణారావు

iyr krishna rao on ttd

  • సన్నిధియాదవుని వారసత్వ హక్కులను పునరుద్ధరించారు
  • చాలా స్పష్టతతో చట్టాన్ని సవరించారు
  • 2007లో ఈ స్పష్టత లోపించింది 
  • అర్చకుల విషయంలోనూ స్పష్టత రావాలి 

తిరుమల తిరుపతి దేవస్థానంలో యాదవులకు తరతరాలుగా ఉన్న హక్కులను పునరుద్ధరిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రశంసించారు. తిరుమల ఆలయం తలుపులు తెరిచేందుకు సన్నిధి గొల్లలకు తిరిగి వారసత్వ హక్కులు కల్పించిన విషయంపై ఆయన ట్వీట్లు చేశారు.

'సన్నిధియాదవుని వారసత్వ హక్కులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. చాలా స్పష్టతతో హక్కులను పునరుద్ధరిస్తూ చట్టాన్ని సవరించారు. 2007లో అర్చకుల విషయంలో చేసిన చట్టసవరణలో ఈ స్పష్టత లోపించింది. దాని వలన అధికార యంత్రాంగం వారిని గత దశాబ్దంగా ముప్పుతిప్పలు పెట్టారు.
 
'ఇదే విధంగా అర్చకుల విషయంలో కూడా చట్ట సవరణలో స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండు అంశాలు దేవాదాయ చట్టం ఒకే ప్రకరణ కిందికి వస్తాయి' అని కృష్ణారావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News