Dokka manikya varaprasad: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు

 YSRCP candidate Dokka  files nomination for MLC by poll
  • నేడు నామినేషన్‌ గడువుకు చివరి రోజు 
  • అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు‌ పత్రాలు అందజేత
  • డొక్కాతో పాటు వచ్చిన వైసీపీ నేతలు
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. గత టీడీపీ హయాంలో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగిన విషయం తెలిసిందే. మార్చి 9న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆయన వైసీపీలో చేరారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

నేడు నామినేషన్‌ గడువుకు చివరి రోజు కావడంతో డొక్కా వరప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఆయన నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీ నందిగం సురేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
Dokka manikya varaprasad
YSRCP
Andhra Pradesh

More Telugu News