KTR: ఆరో విడత హరితహారం ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR launches sixth phase Haritrha Haram

  • తెలంగాణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం
  • 230 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్ష్యమన్న కేటీఆర్
  • 'ఈచ్ వన్ ప్లాంట్ వన్' నినాదంతో ముందుకెళుతున్నామని వెల్లడి

తెలంగాణలో కొన్నాళ్లుగా హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు కూడా హరితహారం కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, మంత్రి కేటీఆర్ హైదరాబాదులో ఆరో విడత హరితహారం కార్యక్రమం షురూ చేశారు. బల్కంపేట, దుండిగల్ వద్ద మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 230 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్ష్యమని, హరిత ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళితే లక్ష్యం సాకారమవుతుందని తెలిపారు. 'ఈచ్ వన్, ప్లాంట్ వన్' నినాదంతో ముందుకెళుతున్నామని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలని కేటీఆర్ సూచించారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడమే ఈ ప్రయత్నమని వివరించారు.

  • Loading...

More Telugu News