Lockdown: దర్శనాల సంఖ్యను పెంచిన టీటీడీ... ఉచిత టికెట్ల జారీ మొదలు పెట్టడంతో వేలమంది క్యూ!
- రోజుకు 3 వేల మందికి ఉచిత దర్శనం
- భూదేవీ కాంప్రెక్స్ లో ప్రత్యేక కౌంటర్
- ఈ నెల 30 వరకూ టికెట్ల జారీ
లాక్ డౌన్ నిబంధనల సడలింపు తరువాత రోజుకు 6 వేల మంది వరకూ దర్శనాలు కల్పిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, దర్శనాల సంఖ్యను పెంచారు. రోజుకు మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడీ, అలిపిరిలోని భూదేవీ కాంప్లెక్స్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసింది.
ఈ ఉదయం టికెట్లను జారీ చేయనున్నామని ప్రకటన వెలువడగానే, భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరికి చేరుకున్నారు. భక్తులంతా భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు అధికారులు కష్టపడాల్సి వచ్చింది. ఈ నెల 30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్ లైన్ టికెట్ల కోటా పూర్తయిందని, ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.