Chiranjeevi: చిరంజీవికి ధన్యవాదాలు తెలిపిన హేమ
- సీసీసీని ప్రారంభించిన చిరంజీవి
- చారిటీకి బాలయ్యతో పాటు పలువురి విరాళం
- తొలి విడతలో 12 వేల మందికి సాయం
కరోనా నేపథ్యంలో షూటింగులు ఆగిపోయి సినీ కార్మికులు అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని చిరంజీవి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చారిటీకి సినీ పరిశ్రమకు చెందిన ఎందరో తమ వంతు విరాళాలను అందజేశారు. తద్వారా ఈ చారిటీ ద్వారా సినీ కార్మికులను ఆదుకున్నారు.
ఈ నేపథ్యంలో నటి హేమ మాట్లాడుతూ... సినీ నటులు, కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. సీసీసీకి సాయం చేసేందుకు బాలకృష్ణతో పాటు పలువురు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ముందుకు వచ్చారని... అందరికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు.
సీసీసీ ద్వారా చేసిన తొలి విడత సాయంలో 12 వేల మందికి అత్యవసర వస్తువులను అందించామని చెప్పారు. ఇప్పుడు రెండో విడత సాయం ప్రారంభమైందని తెలిపారు. హైదరాబాదులో ఉన్న నటులు, కార్మికులకే కాకుండా విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఉన్న వారందరికి ఒక ప్రణాళికాబద్ధంగా వస్తువులను పంపించడం చాలా గొప్ప విషయమని చెప్పారు.