Nara Lokesh: అసలు చెల్లింపులే జరగకపోతే అవినీతి ఎక్కడిది?: నారా లోకేశ్

Nara Lokesh explains details of Atchannaidu decisions as a minister

  • అచ్చెన్న కుటుంబ సభ్యులకు లోకేశ్ పరామర్శ
  • తమ నేతను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వ్యాఖ్యలు
  • జగన్ ను ఆర్థిక ఉగ్రవాదిగా పేర్కొన్న లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అచ్చెన్నాయుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. వైసీపీ మంత్రులు రూ.151 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని, చివరికి తేలింది ఏంటంటే ఆ ప్రాజెక్టు విలువ రూ.3 కోట్లేనని అన్నారు. అది కూడా చెల్లింపులు జరగలేదని స్పష్టం చేశారు.

ఆనాడే ఆ ప్రాజెక్టుపై ఫిర్యాదు వస్తే ఓ కమిటీ వేయడం జరిగిందని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో "రూ.151 కోట్లు లేదు, రూ.3 కోట్లు లేదు, అసలు చెల్లింపులే జరగలేదు... ఇక అవినీతి ఎక్కడ జరిగింది?" అంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇవాళ దొంగకేసులు బనాయించి అచ్చెన్నను అరెస్ట్ చేశారు. జగన్ రెడ్డిలా అచ్చెన్న ఏమీ ఆర్థిక ఉగ్రవాది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News