India: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.. అంతర్జాతీయ విమానాల రద్దును పొడిగించిన భారత్

India extends ban on international flights services

  • ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం జులై 15 వరకు పొడిగింపు
  • కార్గో విమానాలు, ప్రత్యేక విమానాలకు అనుమతి

దేశంలోనూ, దేశం వెలుపల కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే కానీ కేసులు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని జులై 15వ తేదీ వరకు పొడిగించింది.

 అయితే ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలకు, ప్రత్యేక పరిస్థితుల్లో నడిచే విమానాలకు వర్తించదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. దేశీయ విమాన సర్వీసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు మార్చి 23 నుంచి నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News