WHO: కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావాలంటే రాజకీయ శక్తి అవసరం: డబ్ల్యూహెచ్ఓ

WHO Director General Tedros Adhanom tells corona vaccine will be ready in a year

  • యూరోపియన్ పార్లమెంటులో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ప్రసంగం
  • ఏడాదిలోపు వ్యాక్సిన్ వస్తుందని వెల్లడి
  • అందరికీ వ్యాక్సిన్ కష్టసాధ్యమేనని వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సిన్ పరిశోధనలను సమన్వయం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భవిష్యత్ పరిణామాలపై స్పందించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గాబ్రీసియస్ మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ వచ్చినా, అది అందరికీ అందుబాటులోకి రావడం ఎంతో కష్టసాధ్యమైన విషయం అని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందాలంటే మాత్రం రాజకీయ శక్తుల తోడ్పాటు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ అందుబాటులో ఉండే అవకాశాలు పరిమితంగానే ఉన్నందున, వైరస్ బారినపడే చాన్సున్న వాళ్లకు, బలహీనులకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలన్నది ఓ ఆప్షన్ అని వివరించారు. ఇక, వ్యాక్సిన్ పై సాగుతున్న పరిశోధనల గురించి చెబుతూ, ఏడాది లోపు వ్యాక్సిన్ వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని అధనోమ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి చేయడం, సరఫరా వంటి అంశాల్లో అంతర్జాతీయ సహకారం అవసరమని అన్నారు. బ్రసెల్స్ లో యూరోపియన్ పార్లమెంట్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News