Visakha LG Polymers: ఎల్జీ పాలిమర్స్ రూ. 50 కోట్లను ఇప్పుడే పంచొద్దు: సుప్రీంకోర్టు

Supreme court extends stay on Rs 50 cr of LG Polymers

  • అదనపు పత్రాలను సమర్పించేందుకు ఎల్జీ పాలిమర్స్ కు అనుమతి
  • రూ. 50 కోట్ల పంపిణీపై మధ్యంతర స్టే కొనసాగుతుందన్న సుప్రీం
  • అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని వ్యాఖ్య

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం విచారించింది. పిటిషన్ కు సంబంధించి అదనపు పత్రాలను సమర్పించేందుకు ఎల్జీ పాలిమర్స్ కు కోర్టు అనుమతించింది. అంతేకాదు, ఘటన జరిగిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన రూ. 50 కోట్లను ఇప్పుడే పంపిణీ చేయవద్దని ఆదేశించింది. రూ. 50 కోట్ల పంపిణీపై మధ్యంతర స్టే కొనసాగుతుందని తెలిపింది. ప్రమాదంపై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ ను విచారిస్తామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News