Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసిన వ్యక్తి అరెస్ట్

man arrested for forwarded a message on social media
  • వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై ఫేస్‌బుక్‌లో పోస్టు
  • ఫార్వార్డ్ చేసినందుకు అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఘటన
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసిన వ్యక్తిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వట్టికూటి నరసింహారావు (66) కుటుంబ తగాదాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆయన భార్య, కుమారుడు నెలపర్తిపాడులో ఉంటున్నారు. విజయసాయిరెడ్డిపై ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టును ఆయన సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేశారు. మంగళగిరికి చెందిన బొట్టు రవి ఈ పోస్టును చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దానిని నరసింహారావు ఫార్వార్డ్ చేసినట్టు గుర్తించారు. గురువారం రామచంద్రాపురం వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని మంగళగిరి తీసుకెళ్లారు.
Vijayasai Reddy
YSRCP
Social Media
CID

More Telugu News