Anjani Kumar: కారు పక్కనే కనిపించిన పామును స్వయంగా పట్టుకున్న హైదరాబాద్ సీపీ

Hyderabad CP Anjani Kumar captures a snake
  • వాకింగుకి వెళ్లిన సీపీ అంజనీ కుమార్
  • పామును చూసి అరిచిన పెంపుడు కుక్క
  • పామును పట్టి నెహ్రూ జూ పార్క్ కు తరలించిన సీపీ
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఓ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన తన కారును ఓ ప్రదేశంలో నిలిపి నడక సాగిస్తున్నారు. కారు వద్ద ఉన్న పెంపుడు కుక్క అదేపనిగా అరుస్తుండడంతో ఆయన కారు వద్దకు వెళ్లారు.

దేన్ని చూసి కుక్క అరుస్తోందని ఆయన అన్ని వైపులా పరిశీలించగా, అక్కడ ఓ పాము కనిపించింది. వెంటనే తన సిబ్బంది సాయంతో అంజనీ కుమార్ స్వయంగా ఆ పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని నెహ్రూ జూ పార్క్ సిబ్బందికి అప్పగించారు. పాములు కనిపించినప్పుడు తొందరపాటుతో వాటిని చంపరాదని, పాములు సైతం పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తుంటాయని అంజనీ కుమార్ వివరించారు. తమ పోలీసు విభాగంలో కూడా కొందరికి పాములు పట్టడంలో శిక్షణ ఇప్పించామని తెలిపారు.
Anjani Kumar
Snake
Walking
Police
Commissioner
Hyderabad

More Telugu News