ACB: మూడో రోజు ముగిసిన అచ్చెన్నాయుడు విచారణ... వివరాలు ఇవిగో!

ACB interrogates Atchannaidu at GGH
  • గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్న
  • ఆసుపత్రిలోనే అచ్చెన్నను విచారిస్తున్న ఏసీబీ అధికారులు
  • అచ్చెన్నాయుడి జవాబులపై ఏసీబీ అధికారుల అసంతృప్తి!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడో రోజు కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు రెండున్నర గంటలు ప్రశ్నించారు. ఈ మూడ్రోజుల్లో మొత్తం పదిన్నర గంటల పాటు ఏసీబీ విచారణ సాగింది. ఈఎస్ఐ టెలీహెల్త్ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లపైనా, టెలీహెల్త్ సేవలకు సంబంధించి సిఫారసు లేఖపై అచ్చెన్న సంతకం చేయడంపైనా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా అచ్చెన్న జవాబులతో అసంతృప్తికి గురైన అధికారులు ఆయన మనసు విప్పి జవాబు చెప్పడం లేదని భావించారని సమాచారం. కాగా, అధికారులు అడిగిన ప్రశ్నలకు అచ్చెన్న బదులిస్తూ, కొనుగోళ్ల సమయానికి తాను మంత్రిగా లేనని, తెలంగాణ మాదిరి వాటి అమలుపై అధ్యయనానికి సూచించానని, మినిట్స్ పై సంతకం చేశాను తప్ప కొనుగోలు ఫైలు తన వద్దకు రాలేదని చెప్పినట్టు వెల్లడైంది.
ACB
Atchannaidu
GGH
ESI Scam
Telugudesam
YSRCP

More Telugu News