Narendra Modi: గాల్వన్ ఘర్షణ: దీటుగా బదులిచ్చామన్న ప్రధాని మోదీ

Those who eyed Indian territory in Ladakh have received a befitting reply modi

  • స్నేహంగా ఎలా ఉండాలో భారత్‌కు తెలుసు
  • అలాగే, ఎలా దీటుగా బదులివ్వాలో కూడా తెలుసు
  • 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారు
  • మన కోసం సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు 

గాల్వన్‌ లోయ వద్ద చైనా సైనికులతో జూన్‌ 15న చోటు చేసుకున్న ఘర్షణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పందిస్తూ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గాల్వన్‌ లోయపై కన్ను పడిన వారికి దీటుగా బదులిచ్చామని తెలిపారు. స్నేహంగా ఎలా ఉండాలో భారత్‌కు తెలుసని, అలాగే, ఎలా దీటుగా బదులివ్వాలో కూడా తెలుసని వ్యాఖ్యానించారు.

సరిహద్దుల వద్ద దేశాన్ని కాపాడే క్రమంలో 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారని ఆయన కొనియాడారు.  దేశంలో మనం సమస్యలు లేకుండా జీవించేందుకు సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పారు.

కరోనా కష్టకాలంలో దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు పౌరులంతా కృషి చేయాలని మోదీ చెప్పారు. దేశీయ ఉత్పత్తుల వాడకానికే ప్రాధాన్యత ఇవ్వాలని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని చెప్పారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నిబంధనలు పాటించకపోతే ప్రమాదమని తెలిపారు. 2020లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. అన్ని సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News