Cobras: వారం నుంచి ఇంట్లో పాము బుసలు... చూస్తే 43 నాగుపాము పిల్లలు!

Large number of snakes was captured in a house
  • ఒడిశాలో ఘటన
  • స్నేక్ హెల్ప్ లైన్ ను సంప్రదించిన ఇంటి యజమాని
  • తల్లిపామును కూడా పెట్టుకున్న హెల్ప్ లైన్ సిబ్బంది
ఒడిశాలోని ఓ ఇంట్లో ఏకంగా 43 నాగుపాము పిల్లలు బయటపడ్డాయి. వాటి తల్లి కూడా అక్కడే ఉంది. భద్రక్ జిల్లాలో రంగరాజ్ పూర్ ప్రాంతంలోని విజయ్ బిస్వాల్ నివాసంలో గతవారం రోజులుగా పాము బుసలు వినిపిస్తున్నాయి. ఎక్కడ వెదికినా ఏమీ కనిపించకపోవడంతో ఆ ఇంటి యజమాని స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బందికి విషయం వివరించారు.

దాంతో స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు 6 గంటలపాటు శ్రమించి 43 నాగుపాము పిల్లలను పట్టుకున్నారు. వాటితో పాటు తల్లి నాగుపామును కూడా బంధించారు. అంతేకాదు, మరో 58 పొదగని పాము గుడ్లను కూడా గుర్తించారు. దొరికిన పాముపిల్లలు, గుడ్ల సంఖ్య ఆధారంగా మొత్తం మూడు తల్లి పాములు ఉండే అవకాశం ఉందని, ఓ పెద్ద నాగుపాము దొరకగా, మరో రెండు పాములు తప్పించుకుని ఉంటాయని భావిస్తున్నారు.
Cobras
Odisha
Snakes
Help Line

More Telugu News