Renu Desai: మహేశ్ బాబుతో సినిమా అనగానే ఎన్నో అభినందనలు... కానీ అంతలేదన్న రేణు దేశాయ్!

Renu Desai Clarifies Not Acting in Mahesh Movie
  • మహేశ్ చిత్రంలో రేణు నటిస్తున్నట్టు వార్తలు
  • నేను విన్న అతిపెద్ద రూమర్ ఇదే
  • అవకాశం వస్తే తానే చెబుతానన్న రేణూ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చిత్రంలో ఓ కీలక పాత్రను రేణు దేశాయ్ చేస్తున్నారంటూ, గత వారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తాజాగా స్పందించిన రేణు దేశాయ్, ఇదే తాను విన్న అతి పెద్ద రూమర్ అని అన్నారు. గత రెండు మూడు రోజులుగా తనకు చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని, ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె, మహేశ్ బాబుతో సినిమాకు, తనకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు.

ఇంత పెద్ద చిత్రంలో తనకు నటించే అవకాశం వస్తే, తానే ప్రకటన చేసుండేదాన్నని, తనకు కూడా నటించాలని ఉందని, గతంలో తల్లి పాత్రల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు అంగీకారం తెలిపానని, దాని ఆధారంగానే ఈ తప్పుడు రూమర్ పుట్టుండవచ్చని అన్నారు. ఇక సినీ ఫీల్డ్ లో నెపోటిజంపై స్పందిస్తూ, బంధుప్రీతి ప్రతి చోటా ఉంటుందని, లేదని చెప్పడం అబద్ధమే అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే, బంధుప్రీతి కారణంగా ఒకటి, రెండు అవకాశాలు మాత్రమే వస్తాయని, ఆపై టాలెంట్ ఉంటేనే ఎదుగుతారని అన్నారు.

అకీరాకు ఇప్పుడు 16 ఏళ్లు మాత్రమేనని, అతను ఏ వృత్తిని ఎంచుకున్నా, ఓ తల్లిగా ప్రోత్సహిస్తానని, సినీ రంగాన్ని ఎంచుకోవడం అన్నది అతని ఇష్టమేనని అన్నారు. వాళ్ల నాన్న, పెద్దనాన్న, అన్నయ్యలు హీరోలు కాబట్టి, నువ్వు కూడా హీరో కావాలని తానేమీ ఒత్తిడి పెట్టబోనని అన్నారు. ఆద్య ఇంకా చిన్న పిల్లేనని, ప్రస్తుతానికి తనకు సంగీతం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
Renu Desai
Mahesh Babu
Movie
Fake News

More Telugu News