New Delhi: ఢిల్లీలోని భవన నిర్మాణాల్లో లోపాలు.. 90 శాతం భవనాలు భూకంపాలను తట్టుకోలేవు: ఎంసీడీ నివేదిక
- ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధ్యయనం
- వంద భవనాలకు నోటీసులు జారీ చేసిన ఎంసీడీ
- స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశం
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) విడుదల చేసిన నివేదిక ఒకటి నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని దాదాపు 90 శాతం భవనాలు భూకంపాలను తట్టుకోలేవని తేల్చి చెప్పింది. తరచూ భూకంపాలకు గురయ్యే నగరంలో ఇప్పుడీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది.
ఆయా భవన నిర్మాణాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడు ఇవి తట్టుకోలేవని నివేదిక పేర్కొంది. లోపాలను గుర్తించిన దాదాపు 100 భవనాలకు దక్షిణ ఎంసీడీ నోటీసులు జారీ చేసింది. నెహ్రూ ప్లేస్లో ఉన్న 16 అంతస్తుల మోడీ టవర్, 17 అంతస్తుల ప్రగతిదేవి టవర్, 15 అంతస్తుల అన్సల్ టవర్, 17 అంతస్తుల హేమ్కుంట్ టవర్ల నిర్మాణాత్మక ఆడిట్ కోసం నోటీసులు ఇచ్చింది. నోటీసు అందుకున్న భవనాల యజమానులు 90 రోజుల్లో నిర్మాణాత్మక ఆడిట్ నిర్వహించాలని కోరింది.