China Products: డ్రాగన్ పై ప్రజాగ్రహం.. 'మేడిన్ చైనా' వస్తువులను తగలబెడుతున్న ఆగ్రా వాసులు!
- చైనా తీరును నిరసిస్తున్న ఆగ్రా వాసులు
- చైనా వస్తువులను ఉపయోగించొద్దని పిలుపు
- నగర కూడళ్లలో చైనా వస్తువుల దగ్ధం
గాల్వన్ లోయలో 20 మంది భారత జవాన్ల ప్రాణాలను చైనా బలిగొన్న నేపథ్యంలో... డ్రాగన్ కంట్రీపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆగ్రా వాసులు చైనా తీరును నిరసిస్తూ... మేడిన్ చైనా వస్తువులను దహనం చేస్తున్నారు. చైనా వస్తువులను బహిష్కరించి, ఆ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తామని అంటున్నారు. నగరంలోని కూడళ్లలో చైనా వస్తువులను వేసి దగ్ధం చేస్తున్నారు.
చైనాలో తయారైన ఫోన్లు, టీవీలను సైతం తగలబెట్టారు. చైనా వస్తువులను తగలబెట్టడం ద్వారా అమర వీరులకు నివాళి అర్పిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. భారతీయులెవరూ చైనా వస్తువులను ఉపయోగించొద్దని పిలుపునిచ్చారు. దీపావళి నాటికి చైనా వస్తువులు లేకుండా చేయాలని ఈ సందర్భంగా ఆగ్రా మేయర్ కోరారు.