Sensex: నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- 209 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 70 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- బ్యాంకింగ్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్లు కోల్పోయి 34,961కి పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 10,312 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.97%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.30%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.27%), భారతి ఎయిర్ టెల్ (1.24%), ఐటీసీ (1.08%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-4.78%), టెక్ మహీంద్రా (-3.47%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.87%), ఎల్ అండ్ టీ (-2.65%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.50%).