Nagababu: కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ పని చేయగలదు: నాగబాబు
- గాంధీలు, నెహ్రూ బొమ్మలను కాయిన్స్ పై ముద్రించారు
- లాల్ బహదూర్ శాస్త్రి బొమ్మను ఎందుకు ముద్రించలేదు?
- గొప్పవారి బొమ్మలను ముద్రించాలి
స్వాతంత్ర్య సమరయోధులు, గొప్ప నాయకుల గౌరవార్థం, వారిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలనే లక్ష్యంతో కరెన్సీ కాయిన్స్ పై వారి బొమ్మలను ముద్రిస్తుంటారు. ఈ అంశంపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తన యూట్యూబ్ చానల్ ద్వారా స్పందిస్తూ, కాయిన్స్ పై మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూవంటి వారి బొమ్మలను ముద్రించారని... లాల్ బహదూర్ శాస్త్రి వంటి గొప్ప నేత బొమ్మను ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. మహమ్మదీయులపై చత్రపతి శివాజీ, రాణాప్రతాప్ సింగ్, బాజీరావ్ పేష్వా వంటి వారు యుద్ధాలు చేశారని చెప్పారు.
మన దేశంలో ఎంతో గొప్ప సింగర్స్, రైటర్స్, కవులు, సంఘ సంస్కర్తలు, క్రీడాకారులు, ఇతర నాయకులు ఉన్నారని... వాగి గొప్పదనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే... వారి బొమ్మలను కాయిన్స్ పై ముద్రించాలని నాగబాబు అన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులపై కూడా గొప్ప వ్యక్తుల చిత్రాలను ముద్రిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పని కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పారు. పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.