TikTok: గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి 'టిక్‌టాక్' మాయం!
- కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో చర్యలు
- గూగుల్, యాపిల్ సంస్థలకు ఉత్తర్వులు
- నిన్న రాత్రి వరకు కనపడిన టిక్‌టాక్
- నేటి ఉదయం నుంచి మాయం
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఆ దేశానికి బుద్ధి చెప్పాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. భారతీయులు అధికంగా వాడుతోన్న టిక్‌టాక్ కూడా ఈ జాబితాలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో అధికారులు గూగుల్, యాపిల్ సంస్థలకు ఉత్తర్వులను పంపారు.
దీంతో భారత్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి వాటిని తొలగించారు. నిన్న రాత్రి వరకు అవి అందులో కనపడగా, నేటి ఉదయం నుంచి మాయం కావడం గమనార్హం. ఆయా స్టోర్లలో ప్రస్తుతం టిక్‌టాక్ కోసం సెర్చ్ చేస్తే ఆ యాప్ కనపడట్లేదు. భారత సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు వంటి వాటికి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్స్‌ను నిషేధించారు.