Abhisheik Manu Singhvi: కోలుకోగానే నా ప్లాస్మా దానం చేస్తా: అభిషేక్ సింఘ్వీ
- గత వారం వ్యాధి బారిన పడిన కాంగ్రెస్ నేత
- ఇంట్లోనే చికిత్స చేస్తున్న వైద్యులు
- ట్విట్టర్ లో ప్లాస్మా దానంపై ప్రకటన
కరోనా మహమ్మారి బారిన పడి, ప్రస్తుతం ఇంట్లోనే చికిత్సను తీసుకుంటున్న కాంగ్రెస్ నేత అభిషేక్ మనూ సింఘ్వీ, తాను కోలుకోగానే ప్లాస్మాను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "దేవుడి దయవల్ల కరోనా చికిత్సలో నాకు ప్లాస్మా అవసరం రాలేదు. కానీ, ప్లాస్మా థెరపీపై ఆంక్షలు విధించడం హాస్యాస్పదం.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల్లో అత్యంత ప్రభావశీలమైనది ఇదే. ఢిల్లీ ఆరోగ్య మంత్రిని ప్లాస్మానే కాపాడింది. నేనిప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను కోలుకున్న తరువాత నా ప్లాస్మాను దానం చేస్తాను" అన్నారు. కాగా, గత వారం అభిషేక్ సింఘ్వీకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కోలుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.