TikTok: మీ స్మార్ట్‌ఫోన్‌లో 'టిక్​టాక్'ను అన్‌ఇన్‌స్టాల్‌ చేశారా?.. లేకపోతే హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందట!

uninstal  tiktok says experts

  • ఇప్పటికే ప్లే స్టోర్‌ నుంచి టిక్‌టాక్‌ మాయం
  • బ్యాన్‌ చేసిన యాప్స్ అన్నీ ఆన్‌లైన్‌ ఆధారంగా పని చేసేవే
  • స్మార్ట్‌ ఫోన్లలో ఇప్పటికీ ఉన్నప్పటికీ పని చేయవు
  • అయినా అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తే మంచిది
  • లేదంటే హ్యాకర్ల బారినపడే ప్రమాదం

టిక్‌టాక్‌తో పాటు చైనాకు చెందిన మరో 58 యాప్‌లను భారత్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి తొలగిస్తున్నారు. ఇప్పటికే వాటి నుంచి టిక్‌టాక్‌ మాయమైపోయింది. భారత్‌లో ఆ యాప్‌కు యువత నుంచి ఎంతగా ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలనుకున్న వారికి ఇక ఆ అవకాశం లేదు. అయితే, దేశంలో లక్షలాది మంది ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఈ టిక్ టాక్ ను  ఇప్పుడు అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలా? అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది.

ఒకవేళ అన్ఇన్‌స్టాల్‌ చేయకుంటే చట్టపరంగా ఇబ్బందులు ఏవైనా ఎదుర్కొనే ప్రమాదం ఉందా? అనే ప్రశ్న కూడా వారిలో తలెత్తుతోంది. ఆ ప్రమాదం వారికి లేనప్పటికీ నిషేధించిన ఆ చైనా యాప్స్ అన్నీ ఆన్‌లైన్‌ ఆధారంగా పని చేసేవే. అవి స్మార్ట్‌ ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉన్నప్పటికీ పని చేయవు. ఆ యాప్‌లో అప్‌డేట్లు ఇకపై కనపడవు.

అయితే, ఆ యాప్‌ను స్మార్ట్‌ఫోన్లలో ఉంచుకోకపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో భద్రత తగ్గిపోతుండడంతో వాటి ద్వారా స్మార్ట్‌ఫోన్లు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువని చెబుతున్నారు.

కాగా, భారత్‌తో నిషేధం విధించిన నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ యాక్సెస్ చేయకుండా భారత్‌లో బ్లాక్‌ చేస్తారు. అయితే, ఒక్కోసారి కొన్ని యాప్‌ల ద్వారా హ్యాకర్లు దాడి చేసే ప్రమాదముంది.

  • Loading...

More Telugu News